శ్రీకాళహస్తి, ఏప్రిల్ 26 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పట్టణంలో ఇంధన కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని ఆర్డీవో భానుప్రకాశ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఊరందూరు ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. పట్టణ పరిధిలో ఉన్న 14 పెట్రోల్ బంకుల్లో ప్రస్తుతం 7 బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాహనదారులు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల తాత్కాలిక కొరత ఏర్పడుతోందని చెప్పారు. బంక్ నిర్వాహకులు ఇప్పటికే చెల్లింపులు పూర్తి చేశారని, మరో రెండు నుంచి మూడు రోజుల్లో సరఫరా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తుందని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లో బాటిళ్లు, క్యాన్లలో ఇంధనం నింపరాదని, నిల్వలు ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు ఉంచితే సంబంధిత బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు అత్యవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్ ప్రేమ్ కుమార్తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంధన కొరతపై ఆందోళన అవసరం లేదు- ఆర్డీవో భానుప్రకాశ్