*గుడ్ మార్నింగ్ రంగాపూర్* కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ *నేనావత్ బాలకృష్ణ*
పున్నమి న్యూస్ ప్రతినిధి
22 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
*గుడ్ మార్నింగ్ రంగాపూర్* కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ *నేనావత్ బాలకృష్ణ*
ఆధ్వర్యంలో జలాల్ మియా పల్లె 7,8 వ వార్డులలో పర్యటించడం జరిగింది. ప్రజల నుండి సమస్యలు స్వీకరించి, వేసవికాలం దృష్ట గ్రామంలో పశువులకు, గొర్రెలు, మేకలకు తాగునీటి సదుపాయం కోసం వెంటనే నీటితోట్లను ఏర్పాటు చేయాలని,అదేవిధంగా వీధి దీపాలు, డ్రైనేజీ ,మంచినీటి నిర్వహణ ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామ ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అంగన్వాడి కేంద్రo సందర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ పంధుగుల యాదగిరి, గ్రామ వార్డు మెంబర్లు ఇటుకల దివ్య, వెలగపెల్లి లింగం, వలవోజు అశోక్, చింతపల్లి మనిత, పంచాయతీ సెక్రెటరీ పురుషోత్తం రెడ్డి, అంగన్వాడి టీచర్ సునీత, డ్వాక్రా మహిళలు మరియు సంబంధిత గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


