శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి నవీన్ కుమార్ టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ హోటల్లో జరిగిన ఈ భేటీ అత్యంత ఆత్మీయంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్.. బాలకృష్ణకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను వివరిస్తూ, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తూనే, రాజకీయాల్లోనూ ప్రజా సేవకు అంకితమైన బాలయ్యను కలవడం పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

తాజ్ హోటల్లో ‘లెజెండ్’ బాలకృష్ణను మర్యాదపూర్వక కలిసిన జనసైనికుకు నవీన్ కుమార్.