Thursday, 16 April 2026
  • Home  
  • బడుగు వర్గాలకు టిడిపిలో ప్రాధాన్యం మరింత బలోపేతం- డా. ఉమేష్ రావు
- తిరుపతి

బడుగు వర్గాలకు టిడిపిలో ప్రాధాన్యం మరింత బలోపేతం- డా. ఉమేష్ రావు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వస్తోందని టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పార్టీ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. టిడిపి జాతీయ, రాష్ట్ర కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించడం శుభపరిణామమని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన డా.జి. దశరథాచారి, యం. సుబ్బయ్యలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించడం ద్వారా బడుగు వర్గాల పట్ల పార్టీ నిబద్ధత మరోసారి రుజువైందన్నారు. శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పక్షపాతిగా నిలుస్తున్నారని, ఈ నియామకాలు దానికి నిదర్శనమని తెలిపారు. అలాగే పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కృషి చేసిన సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం నాయకత్వం ప్రత్యేకతగా కొనియాడారు. రాష్ట్ర కమిటీలో 185 మంది సభ్యుల్లో 122 మందిని బడుగు వర్గాలకు చెందిన వారిగా ఎంపిక చేయడం ద్వారా సామాజిక సమతుల్యత సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.