శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న బలిజ భవనాన్ని జాతీయ కాపు ప్రచార కార్యదర్శి గోపి రాయల్ ఆధ్వర్యంలో కాపు సంఘం కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పనుల నాణ్యతపై నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా గోపి రాయల్ మాట్లాడుతూ బలిజ భవనం సమాజానికి ఐక్యతను పెంపొందించే కేంద్రంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కాపు సంఘం నాయకులు కూడా భవనం నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. సమాజ అభివృద్ధికి ఇలాంటి వసతులు ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్, ఏటీఎస్, సిద్ధుల ప్రసాద్, ముత్యాల పార్థసారథి, చక్రాల మురళి, మగరాల గణేష్, దుమ్ము రాయల్, ముని తదితర బలిజ సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సమాజ ఐక్యతకు బలిజ భవనం కేంద్రం కావాలి-గోపి రాయల్