తోటంబేడు, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గం తోటంబేడు మండలానికి చెందిన గ్రామీణ శాస్త్రవేత్తలు తయారుచేసిన “జీవామృతం” సరఫరా విషయంలో భారీ ఆర్థిక వివాదం తలెత్తింది. హైదరాబాద్‌కు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి సుమారు రూ.5 కోట్ల విలువైన సరుకు తీసుకుని ఇప్పటికీ చెల్లింపులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని శాస్త్రవేత్తలు ఆరోపించారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోగా, వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే ఫ్యాక్టరీకి రావాలని కోరినా, దుర్గాప్రసాద్ తప్పుడు సమాచారం అందిస్తూ పోలీసులను రంగంలోకి దింపుతున్నారని ఆరోపించారు. ఇటీవల పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని, స్థానిక శాస్త్రవేత్తలపైనే ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారాకొల్లు గ్రామానికి చెందిన శాస్త్రవేత్త చంద్రశేఖర్ నాయుడుపై కూడా బెదిరింపులు జరిగాయని తెలిపారు. ఇంకా, స్థానికులకు డబ్బులు చెల్లించకుండా రాజకీయ, పోలీసు ప్రభావం ఉపయోగించి వివాదాన్ని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామీణ శాస్త్రవేత్తలు విమర్శించారు. పోలీసులు నాన్-లోకల్ వ్యక్తుల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, తమపై చులకనగా ప్రవర్తించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తమ పరిశోధనలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించి సన్మానించిన విషయాన్ని గుర్తుచేసిన శాస్త్రవేత్తలు, తమ ప్రయోగాలు ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు పొందినవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామీణ శాస్త్రవేత్తలు తెలిపారు.

గ్రామీణ శాస్త్రవేత్తలపై వేధింపుల ఆరోపణలు…రూ.5 కోట్లు బకాయి వివాదం చెలరేగింది