పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ 26-3-2026
ముస్తాబాద్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై సర్పంచ్ మట్ట వెంకటేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి, నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థను మరమ్మతు చేయించి, అవసరమైతే అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు..


