తిరుపతి జిల్లా
వెంకటగిరి
24-07-2026
వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కిటకిటలాడిన నేదురుమల్లి నివాసం
వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసం శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కిటకిటలాడింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనతో రూపొందించిన ‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేదురుమల్లి నివాసానికి చేరుకున్నారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఆయన పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వినోద్ కుమార్


