శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్యాస్ కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం నాడు పలు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందేలా అధికారులు ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, అక్రమ విక్రయాలకు పాల్పడటం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ పంపిణీలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని సూచించారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సేవల నాణ్యతను మెరుగుపరచాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏజెన్సీల నిర్వాహకులకు స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తిలో గ్యాస్ కొరతకు చెక్ – ఏజెన్సీలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కఠిన ఆదేశాలు