T.Ravinder
ఖమ్మం మార్చి
(పున్నమి ప్రతినిధి)
*ఖమ్జిమం జిల్లా డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు.
ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఇండియా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
గత మూడు నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.300 పెంచిందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అబద్ధాలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు.
రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశంపై మాట్లాడనున్నట్లు తెలిపారు.
యుద్ధ ప్రభావంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
ముఖ్యంగా యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్ పై చేయి సాధించిందని వ్యాఖ్యానించారు.
యుద్ధ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. భద్రాచలం టెంపుల్ శ్రీరాముడి ఆశీస్సులు దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా కరెంట్ లేని గూడాలు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వలేదని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
యుద్ధ ప్రభావంతో ఆయిల్‌తో పాటు ప్లాస్టిక్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
Ok



