పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ నాయకులు చంద్రగిరి వైసీపీ పార్టీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుని పేదలకు అల్పాహారం అందించారు. ఒక వైసీపీ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు.తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం శ్రీ ప్రసన్న వెంకటేశ్వరపురం లో వైసిపి పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం మండల వైసీపీ కన్వీనర్ ఎద్దులచంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నాయకులు. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా చంద్రగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాలు వైఎస్ఆర్సిపి కి కొత్తమి కాదని, కష్ట కాలంలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి , వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


