ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):
ఖమ్మం అర్బన్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడిగా పందుల సీతయ్యను నియమించారు. గురువారం మండల అధ్యక్షుడు వంకదాని రామకృష్ణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పందుల సీతయ్య పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకుడని, ఖమ్మం అర్బన్ మండలంలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలు మరింత ఉపయోగపడతాయని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పందుల సీతయ్య మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సీతయ్య తెలిపారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, జిల్లా నాయకులు వెంకన్న, దొంగల బాబురావు తదితరులు పాల్గొన్నారు.


