పున్నమి ప్రతినిధి , రామచంద్రపురం
రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో సోమవారం నాడు కెరీర్ గైడెన్స్, ప్లేస్మెంట్ మరియు ట్రైనింగ్ సెల్ ఆధ్వర్యంలో అపోలో ఫార్కసీస్ లిమిటెడ్ సంస్థ క్యాంపన్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఈ నిమామక ప్రక్రియలో బి. ఫార్మసి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా మొత్తం 11 మంది విద్యార్థులు ఆపాలో ఫార్మసీన్ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ యిం . నిరంజన్ బాబు. తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అపోలో ఫార్మసిస్ సంస్థ తరుపున వాసు, ప్రతాప్ నాయిక్, కిరట్, తేజశ్రీ పాల్గొన్నారు.




