Saturday, 6 June 2026
  • Home  
  • గ్రామీణ విద్యార్థులకు ప్రగతి సంస్థ అవగాహన కార్యక్రమాలు
- తిరుపతి

గ్రామీణ విద్యార్థులకు ప్రగతి సంస్థ అవగాహన కార్యక్రమాలు

శ్రీకాళహస్తి రూరల్, జూన్ 06, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలంలోని బి.వి.పురం, పాపనపల్లి, దొడ్లమిట్ట, ఎర్రగుడిపాడు గ్రామాల్లో ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేస్తూ పిల్లలు సమయం వృథా చేయకుండా, చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు ఇంటింటికీ వెళ్లి వారిని ఒకచోటికి చేర్చి ఈ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, వాతావరణ కాలుష్య నివారణ, ప్లాస్టిక్ నిషేధం, ఇంధన పొదుపు, విద్యుత్ ఆదా మరియు నీటి సక్రమ వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తతపై పిల్లలకు వివరించారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వృథా వస్తువులతో అందమైన కళాఖండాల తయారీపై శిక్షణ ఇచ్చారు. స్థానికంగా దొరికే తక్కువ ఖర్చు వస్తువులకు రంగులు వేసి బాలబాలికలు అద్భుతమైన వస్తువులను రూపొందించారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి ఆటపాటలతో పాటు యోగా వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రగతి స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ….సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులు మానసికంగా సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో-కన్వీనర్ రామచంద్ర, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.