తిరుపతి , పున్నమి ప్రతినిధి
తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వినతి పత్రం శుక్రవారం అందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరించిందని కావున మౌళిక సదుపాయాలు జనాభాకు తగ్గట్టు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వివరించారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిపాలన భవనం( సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం ) పనులు గత ప్రభుత్వ నిర్వాకంతో నిలిచిపోయాయని దీన్ని పూర్తి చేసేందుకు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. అలాగే ఆర్టీసి సెంట్రల్ బస్టేషన్ స్థానంలో
ఈపిసి విధానంలో ఇంటర్ మోడల్ స్టేషన్ నిర్మాణానికి సహకరించాలని ఆయన పవన్ కళ్యాణ్ ను కోరారు. నగరంలో ముప్పయ్ ఏళ్ళక ముందు నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ నిత్యం లీకేజీలతో మురుగునీరు రోడ్లపై ప్రవహించే పరిస్థితి నెలకొందని ఎమ్యెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. జనభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అమృత్ 2.0 పథకం కింద నూతన యూజిడి వ్యవస్థ కోసం 284 కేంద్రంతో చర్చించి నిధులు ఇప్పించాలని పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. తిరుపతి కార్పోరేషన్ లో తాగునీటి సరఫరా నెట్వర్క్, నిల్వ సామర్థ్యాల బలోపేతానికి ఎనభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. అలాగే కార్పోరేషన్ లో సమగ్ర వర్షపు నీటి డ్రైనేజీ వ్యవస్థ కోసం 101 కోట్లు ముంజూరు చేయించాలని ఆయన విజ్జప్తి చేశారు. కాగా తిరుపతి నగరంలో కేవలం టిటిడికి చెందిన జూనియర్, డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉన్నాయని పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్ళారు. కాబట్టి పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉపయోగపడేలా
జూనియర్, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విజ్జప్తి చేశారు. తిరుపతి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు తెలిపారు.


