ఇబ్రహీంపట్నం మండలంలో కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్…!
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
04 ఫిబ్రవరి 2026
ఇబ్రహీంపట్నం మండల పరిధి పెత్తుల్ల గ్రామ శివారులో ప్రైవేట్ కంపెనీలోని వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలుగా ఏర్పాటు చేసి నిత్యం కాల్చుతూ ఉన్నారు. రాష్ట్రంలో బహిరంగంగా చెత్త కాల్చడం నిషేధం.గత సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పోస్టర్ కూడా విడుదల చేశారు. బహిరంగంగా చెత్త పడవేసిన జరిమానా విధించాలని చట్టం ఉన్నప్పటికీ ఇంకా అక్కడక్కడ గ్రామాల్లో మండలాల్లో చెత్త కాల్చుతూనే ఉన్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్డు అయినా గ్రామ కార్యదర్శి పట్టనట్టు ఉన్నారని గ్రామస్తులు వాపోతున్నారు. చిత్త ప్లాస్టిక్ కాల్చడం వల్ల గాలిలోని నాణ్యత లోపిస్తుందని పలు పరిశోధన సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. చెత్త కాల్చడం వల్ల శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కు కారణం కూడా అవుతుందని బహిరంగంగా చెత్త కాల్చడం ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సంబంధిత వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



