(నెల్లూరు: పున్నమి ప్రతినిధి)
ప్రముఖ వామపక్ష నాయకుడు, సామాజిక సేవకుడు, ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ జాన వెంకన్న (జానా వెంకయ్య) ఇక లేరు. 04.02.2026 ఉదయం 5.30 గంటలకు ఆయన పరమపదించారు. ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, అనంతరం సీపీఎం నెల్లూరు రూరల్‌లో కీలక పాత్ర పోషించారు. ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తూ ఎక్కడ పనిచేసినా పార్టీ శాఖలు, హోల్‌టైమర్లను తీర్చిదిద్దారు. పేదల సేవ, పిల్లల విద్యే లక్ష్యంగా జీవించిన ఆయన అనేక మందికి ఆదర్శం. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు గోమతి నగర్ నివాసం నుంచి ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహదానం కోసం అంతిమ యాత్ర సాగనుంది. వారి మృతికి పున్నమి ప్రతినిధులు, NIFA–CPM మిత్రులు సంతాపం తెలిపారు.
డా. జానా చైతన్య కిషోర్ మరియు కుటుంబ సభ్యులు జోహార్లు అర్పించారు.

జాన వెంకన్న మృతి పట్ల సంతాపం
(నెల్లూరు: పున్నమి ప్రతినిధి) ప్రముఖ వామపక్ష నాయకుడు, సామాజిక సేవకుడు, ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ జాన వెంకన్న (జానా వెంకయ్య) ఇక లేరు. 04.02.2026 ఉదయం 5.30 గంటలకు ఆయన పరమపదించారు. ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, అనంతరం సీపీఎం నెల్లూరు రూరల్‌లో కీలక పాత్ర పోషించారు. ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తూ ఎక్కడ పనిచేసినా పార్టీ శాఖలు, హోల్‌టైమర్లను తీర్చిదిద్దారు. పేదల సేవ, పిల్లల విద్యే లక్ష్యంగా జీవించిన ఆయన అనేక మందికి ఆదర్శం. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు గోమతి నగర్ నివాసం నుంచి ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహదానం కోసం అంతిమ యాత్ర సాగనుంది. వారి మృతికి పున్నమి ప్రతినిధులు, NIFA–CPM మిత్రులు సంతాపం తెలిపారు. డా. జానా చైతన్య కిషోర్ మరియు కుటుంబ సభ్యులు జోహార్లు అర్పించారు.

