*నిరుపేద కుటుంబానికి 1, లక్ష రూపాయలు
ఆర్థిక సహాయం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
*మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.* సర్పంచ్, ఉప సర్పంచ్ ఆడాల గణేష్ తదితరులు..*
పున్నమి న్యూస్ ప్రతినిధి:
24 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
చనిపోయిన నరసింహ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం*
*మేడిపల్లి నక్కర్త గ్రామ వాస్తవ్యులు ఇటీవల కందడి నరసింహ గత కొన్ని రోజుల క్రితం చనిపోయిన సందర్భంగా తన పిల్లలు అనాధలుగా మిగిలిపోవడంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు వచ్చి చందాలుగా సేకరించి*
“1లక్ష రూపాయలు”
*మేడిపల్లి నకర్త సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్, మోటి శ్రీశైలం మాజీ సర్పంచ్ ఎరుకలి బాలరాజ్ గౌడ్, ఉప సర్పంచ్ దింది మధుకర్ రెడ్డి, చిగురంతా సికిందర్ రెడ్డి, ఏవిజి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ గారి చేతుల మీదుగా “పెద్ద కురుమ కలకొండ బీరప్ప”కి ఆ కుటుంబం తరఫున వారికి అందజేయడం జరిగింది.కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేస్తూ…*
*ఈ కార్యక్రమం లో పార్టీ ఉపాధ్యక్షులు జమ్మ గుండాలు, వార్డు సభ్యులు మొక్కపల్లి మహేష్, ముచ్చర్ల ప్రకాష్, బన్ని జంగయ్య, బేత జంగయ్య,గడ్డం మల్లేష్, కలకొండ మల్లేష్, బండ రాజు,ఏరకలి కృష్ణ, జమ్మ శివ,మొరుగు మహేష్, బండ బీరప్ప, పోలే జంగయ్య పాల్గొన్నారు.*



