ఖమ్మం ఆగష్టు 9
(పున్నమి న్యూస్)
ఖమ్మం నగరంలోని నిర్మల్ హృదయ్ విద్యాసంస్థల అధినేత వంగ సాంబ శివరెడ్డి మృతి పట్ల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాంబ శివరెడ్డితో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. ఖమ్మం విద్యారంగ అభివృద్ధికి సాంబ శివరెడ్డి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేశారని పేర్కొన్నారు. ఆయన మరణం విద్యారంగానికి, ఖమ్మం సమాజానికి తీరని లోటని అన్నారు. సాంబ శివరెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



