Sunday, 9 August 2026
  • Home  
  • విజయవాడలో భీమ్ జెన్ జీ భారీ నిరసన.. పోస్టర్ ఆవిష్కరించిన కేవీ కృష్ణారావు
- ప్రకాశం

విజయవాడలో భీమ్ జెన్ జీ భారీ నిరసన.. పోస్టర్ ఆవిష్కరించిన కేవీ కృష్ణారావు

విజయవాడలో భీమ్ జెన్ జీ భారీ నిరసన.. పోస్టర్ ఆవిష్కరించిన కేవీ కృష్ణారావు టంగుటూరు: జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న “భీమ్ జెన్ జీ” భారీ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రకాశం జిల్లా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు కేవీ కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీ కృష్ణారావు మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దళిత, బహుజన వర్గాలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల సాధన కోసం యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు, దళిత నాయకులు బద్రి, క్రాంతి కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

విజయవాడలో భీమ్ జెన్ జీ భారీ నిరసన.. పోస్టర్ ఆవిష్కరించిన కేవీ కృష్ణారావు
టంగుటూరు: జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న “భీమ్ జెన్ జీ” భారీ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రకాశం జిల్లా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు కేవీ కృష్ణారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేవీ కృష్ణారావు మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దళిత, బహుజన వర్గాలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల సాధన కోసం యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు, దళిత నాయకులు బద్రి, క్రాంతి కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.