శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని పి. వి. రామచంద్ర రావు, సరస్వతీ బాయ్ జ్ఞాపకార్థం, సరస్వతీ బాయ్ మున్సిపల్ హై స్కూల్, తెలుగు గంగ కాలనీ నందు పి.వి.ఆర్ గ్రూప్, వారిచే నిర్మించిన లైబ్రరీ రూమ్ ను మంగళవారం నాడు ప్రారంభీంచడం జరిగింది. అనంతరం స్వర్గీయ పి.వి.రామచంద్రరావు, స్వర్గీయ సరస్వతి బాయి చిత్రపటాలకు పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పివిఆర్ గ్రూపు డైరెక్టర్లు పరమేశ్వర రావు వి.పవార్ మాట్లాడుతూ.. తమ తాత స్వర్గీయ పి.వి.రామచంద్రరావు సంకల్పంతో తమ నానమ్మ పేరిట ప్రారంభించిన పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని విద్యార్థులు పుస్తక పఠనం విలువ తెలుసుకొని పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ..తమ పాఠశాలకు పివిఆర్ కుటుంబం ఆది నుంచి అండగా నిలబడి ఉన్నతంగా అభివృద్ధి చెందేలా చేయూత ఇవ్వడం హర్షనీయమని పాఠశాలల్లో సదుపాయాలు కల్పన, మున్సిపల్ టీచర్లను నియమించి చిన్నారులు జ్ఞాన జ్యోతులు వెలిగించడానికి చేస్తున్న కృషి ఎనలేని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పివిఆర్ గ్రూపు డైరెక్టర్లు ప్రతాప్ రావు వి.పవార్, జనార్దన్ రావు జె.పవార్, ముకుందరావు జె.పవార్, పి.వి.శివశంకర్, స్థానిక ప్రముఖులు రిటైర్డ్ జడ్జి రాధాకృష్ణ, గురు దశరథన్, మోహన్ రావు, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, శెట్టిపల్లి సురేష్, జీవి రమణ మూర్తి (స్వామి), మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు, షేక్ మహబూబ్ భాషా, రత్నం రెడ్డి, మహేశ్వర రావు పడోల్కర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


