Friday, 13 February 2026
  • Home  
  • తాటిపర్తి గ్రామంలో నేడు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి
- E-పేపర్

తాటిపర్తి గ్రామంలో నేడు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహణ తాటిపర్తి గ్రామంలో నేడు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం రమేష్ ఝాన్సీ, ఉప్ప సర్పంచ్ ముప్పిడి రమేష్, ముప్పిడి మధుసూదన్ (సహాయ సమాచార పౌర సంబంధాల అధికారి, రంగారెడ్డి జిల్లా), వార్డు మెంబర్ ఏనుగొండ శివ, గ్రామ యువకులు తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, స్త్రీలకు చదువు అవసరం లేదన్న మూఢనమ్మకాలపై పోరాడి మహిళా సాధికారతకు దారి చూపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారని కొనియాడారు. విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని ఆమె జీవితం ఈ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహణ
తాటిపర్తి గ్రామంలో నేడు
మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు,
సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి
అత్యంత ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో
సర్పంచ్ నీలం రమేష్ ఝాన్సీ,
ఉప్ప సర్పంచ్ ముప్పిడి రమేష్,
ముప్పిడి మధుసూదన్ (సహాయ సమాచార పౌర సంబంధాల అధికారి, రంగారెడ్డి జిల్లా),
వార్డు మెంబర్ ఏనుగొండ శివ,
గ్రామ యువకులు తదితరులు పాల్గొని
సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ,
స్త్రీలకు చదువు అవసరం లేదన్న మూఢనమ్మకాలపై పోరాడి
మహిళా సాధికారతకు దారి చూపిన మహనీయురాలు
సావిత్రిబాయి పూలే గారని కొనియాడారు.
విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని
ఆమె జీవితం ఈ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని
సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన
అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.