నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఎమ్మెల్యే సౌమ్య నూతన సంవత్సర కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో స్వాగతించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.




