కొత్తగూడెం “ఆగష్టు 6:(పున్నమి ప్రతినిధి )::
భారతీయ జనతా పార్టీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే లక్ష్యం తో జిల్లా స్థాయి వర్కుషాప్ ఈ రోజు జిల్లా స్థాయి పార్టీకార్యాలయంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ప్రభారీ ఉజయచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వేసేలా ప్రజలలో చైతన్యం కల్పించాలని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా విజయవంతం చెయ్యాలని పార్టీ కార్యకర్తలకి నాయకులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొడియం బాలరాజు గారు, ముసుగు శ్రీనివాస్ రెడ్డిగారు,జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న గారు,హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ బాలగాని గోపిక్రిష్ణ గారు,మరియు జిల్లా పదాధికారులు మండల అధ్యక్షలు, మండల కన్వీనర్ లు కార్యకర్తలు పాల్గొన్నారు..

