*నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000రు వెంటనే చెల్లించాలి*
*జనవరి 1 ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.*
*అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ వద్ద భిక్షాటన కార్యక్రమం*.
*విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి *
*ఈ సందర్భంగా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్చుత రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3 వేల రూపాయల చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటికీ నిరుద్యోగ భృతి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెల గడుస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. నిరుద్యోగులకు నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఆవకాయిక ఫెస్టివల్ కి 5 కోట్ల రూపాయలు, సోషల్ మీడియా పేరుతో వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని నిరుద్యోగులకు మాత్రం నిధులు లేవని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటమైన ప్రకటనలు ఇస్తున్న ఈ 19 లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీసీ ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసే ఉన్న నిరుద్యోగులకు నేటి వరకు రుణాలు మంజూరు చేయలేదని, 2025 -26 సంబంధించిన స్వయం ఉపాధి పథకం రుణాలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని బీసీ కార్పొరేషన్ అధికారులు నిలిపివేయడం జరిగిందని చెప్పారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి నెలలో పెద్ద ఎత్తున యువకులను సమీకరించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధు రెడ్డి, కెల్లా రమణ, రాజు, మురళి లక్ష్మణ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*

నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000రు వెంటనే చెల్లించాలి*
*నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000రు వెంటనే చెల్లించాలి* *జనవరి 1 ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.* *అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ వద్ద భిక్షాటన కార్యక్రమం*. *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * *ఈ సందర్భంగా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్చుత రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3 వేల రూపాయల చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటికీ నిరుద్యోగ భృతి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెల గడుస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. నిరుద్యోగులకు నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఆవకాయిక ఫెస్టివల్ కి 5 కోట్ల రూపాయలు, సోషల్ మీడియా పేరుతో వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని నిరుద్యోగులకు మాత్రం నిధులు లేవని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటమైన ప్రకటనలు ఇస్తున్న ఈ 19 లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీసీ ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసే ఉన్న నిరుద్యోగులకు నేటి వరకు రుణాలు మంజూరు చేయలేదని, 2025 -26 సంబంధించిన స్వయం ఉపాధి పథకం రుణాలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని బీసీ కార్పొరేషన్ అధికారులు నిలిపివేయడం జరిగిందని చెప్పారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి నెలలో పెద్ద ఎత్తున యువకులను సమీకరించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధు రెడ్డి, కెల్లా రమణ, రాజు, మురళి లక్ష్మణ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*

