Thursday, 5 February 2026
  • Home  
  • పెన్షన్ ల కోసం దేశం లోనే అత్యధికం గా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ :మంత్రి కొల్లు రవీంద్ర
- ఆంధ్రప్రదేశ్

పెన్షన్ ల కోసం దేశం లోనే అత్యధికం గా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ :మంత్రి కొల్లు రవీంద్ర

బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో సిసి రోడ్లు, రైతు సేవా కేంద్రం, సచివాలయం ఓపెనింగ్ వంటి పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర గనులు, భూగర్భవనరులు,మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం సూపర్ సిక్స్ వంటి పథకాలతో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ, మరోపక్క ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళుతుందని ఆయన అన్నారు. పెన్షన్లకే సుమారు 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మబడి పథకాన్ని వర్తింప చేస్తుందని, సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని మండలాలు, పంచాయితీలు ప్రభుత్వానికి గెలిపించి ఇస్తే మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని, మచిలీపట్నం పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని దానివల్ల అనుబంధ సంస్థలు వచ్చి ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, దానికి అనుగుణంగానే NH216 రహదారిని ఆరువరుసుల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.

బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో సిసి రోడ్లు, రైతు సేవా కేంద్రం, సచివాలయం ఓపెనింగ్ వంటి పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర గనులు, భూగర్భవనరులు,మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.
అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం సూపర్ సిక్స్ వంటి పథకాలతో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ, మరోపక్క ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళుతుందని ఆయన అన్నారు. పెన్షన్లకే సుమారు 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మబడి పథకాన్ని వర్తింప చేస్తుందని, సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని మండలాలు, పంచాయితీలు ప్రభుత్వానికి గెలిపించి ఇస్తే మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
2027 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని, మచిలీపట్నం పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని దానివల్ల అనుబంధ సంస్థలు వచ్చి ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, దానికి అనుగుణంగానే NH216 రహదారిని ఆరువరుసుల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.