నెల్లూరు, జూలై 23: నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ గురువారం మైపాడు గేటు సమీపంలోని స్మార్ట్ స్ట్రీట్ బజార్ సులభ్ కాంప్లెక్స్ ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుతూ పరిసరాల్లో క్రమం తప్పకుండా శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుబేదార్పేటలో ఈ-ఆటోల ద్వారా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిం



