రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాఘవరాజుపురం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కుడా (KUDA) చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భూ ఆన్లైన్ సమస్యలు, విద్యుత్, రోడ్లు, త్రాగునీరు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలను వివరించారు. వాటిని శ్రద్ధగా విన్న ముక్కా రూపానంద రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన న్యాయపరమైన అంశాలపై విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలే తన ప్రథమ లక్ష్యమని ఆయన తెలిపారు.

రైల్వే కోడూరులో టీడీపీ ప్రజా దర్బార్ – ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారాలు