Thursday, 5 February 2026
  • Home  
  • మహానంది క్షేత్రంలో 30 న వైకుంఠ ఏకాదశి వేడుకలు
- E-పేపర్

మహానంది క్షేత్రంలో 30 న వైకుంఠ ఏకాదశి వేడుకలు

మహానంది : మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత కోదండరామ స్వామి వారికి ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్ .శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్సవమూర్తులను విశేషాలంకరణతో, ఉత్తరద్వారం వద్ద కొలువుతీర్చి ఉత్తర ద్వార పూజ, ప్రత్యేక అర్చనలు తిరుప్పావై సేవలు నిర్వహిస్తారన్నారు. కోదండరామాలాయంలో 500 కేజీల వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో లోకకళ్యాణార్థం లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం చేసే ఈ లక్ష పుష్పోత్సవానికి దాతగా నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రతియేడాది సహకరిస్తున్నారని అన్నారు. నంద్యాలలో మాజీ ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మధు, వేదపండితులు రవిశంకర అవధాని పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.