— పున్నమి ప్రతినిధి
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించింది. “ఘర్ లక్ష్మి ఇన్ఫోబాన్” పేరుతో ఈ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దిశగా ఈ బస్సులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నడవనున్నాయి.


