Monday, 23 March 2026
  • Home  
  • రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు*
- E-పేపర్

రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు*

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు* *వైసీపీ నుంచి దాదాపు 200 కుటుంబాలు జనసేనలోకి – ఘనంగా స్వాగతించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు* *బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారి తో పాటుగా 200 కుటుంబాలు..జనసేన లోకి భారీ చేరికలు..* రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ అనుచరులు, ఆయన వర్గానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి* నాయకత్వంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ, బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారికి పార్టీ కండువా కప్పి, కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు*. అదే విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పలువురు నాయకులను కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. మహిళా నాయకురాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి గారు* కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సభను ఉద్దేశించి *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ…* జనసేన పార్టీ అధ్యక్షులు *శ్రీ పవన్ కళ్యాణ్ గారి* ఆశయాలు, పేదల పట్ల ఆయన చూపే ప్రేమ, సమస్యలను పరిష్కరించే నిజాయితీ నచ్చి పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు పవన్ కళ్యాణ్ గారు దేవుడిలాంటి నాయకుడని పేర్కొంటూ, తనను రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమించడం బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఐకమత్యంతో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి *తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ…* రాబోయే రోజుల్లో చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్నీ జనసేన పార్టీయేనని ధీమా వ్యక్తం చేస్తూ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసి హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి గారు,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు*

*వైసీపీ నుంచి దాదాపు 200 కుటుంబాలు జనసేనలోకి – ఘనంగా స్వాగతించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు*

*బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారి తో పాటుగా 200 కుటుంబాలు..జనసేన లోకి భారీ చేరికలు..*

రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ అనుచరులు, ఆయన వర్గానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి* నాయకత్వంలో జనసేన పార్టీలో చేరారు.

అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ, బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారికి పార్టీ కండువా కప్పి, కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు*. అదే విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పలువురు నాయకులను కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. మహిళా నాయకురాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి గారు* కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు.

ఈ సభను ఉద్దేశించి *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ…*
జనసేన పార్టీ అధ్యక్షులు *శ్రీ పవన్ కళ్యాణ్ గారి* ఆశయాలు, పేదల పట్ల ఆయన చూపే ప్రేమ, సమస్యలను పరిష్కరించే నిజాయితీ నచ్చి పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు పవన్ కళ్యాణ్ గారు దేవుడిలాంటి నాయకుడని పేర్కొంటూ, తనను రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమించడం బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఐకమత్యంతో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర కార్యదర్శి *తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ…*
రాబోయే రోజుల్లో చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్నీ జనసేన పార్టీయేనని ధీమా వ్యక్తం చేస్తూ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసి హృదయపూర్వకంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి గారు,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.