Monday, 23 March 2026
  • Home  
  • హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
- అన్నమయ్య

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

ప్రతి వ్యక్తికి హక్కులు సమానమే వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అనే సందేశంతో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి డిఎంసి రోడ్డులో ఉన్న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల చైర్మన్ డాక్టర్ వి.డేవిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమానత్వం, మానవ విలువలు, హక్కుల పరిరక్షణపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడూ మానవ హక్కుల కాపాడువాడిగా నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాయలసీమ చైర్మన్ వీరబల్లి జయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “దేశంలోని ప్రతి వ్యక్తి కష్టాల్లో ఉన్నా, పేదైనా, సామాన్యుడైన ఆయనకు జీవించడానికి అవసరమైన మౌలిక హక్కులు ప్రభుత్వం కల్పించాల్సిందే. ఆ హక్కుల కోసం పోరాడడం, వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం మనందరి బాధ్యత” అని అన్నారు. అన్నమయ్య జిల్లా విజిలెన్స్ చైర్మన్ గోపినేని ప్రసాద్ మాట్లాడుతూ “ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాటిని ఆపడానికి చట్టాలు ఉన్నా… అమలు పటిష్టంగా చేయాలి. మానవ హక్కుల ఉల్లంఘనను ఎవరూ సహించకూడదు” అని నొక్కి చెప్పారు. నందలూరు రైల్వే కన్సల్టెంట్ మెంబర్ రాచూరి మురళి మాట్లాడుతూ “ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, వాటిని వినియోగించుకునే దిశగా ముందడుగు వేయాలి. సమానత్వం, న్యాయం, గౌరవం ఇవి మన దేశానికి పునాది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, సాయి, వెంకటేష్, బన్నీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రతి వ్యక్తికి హక్కులు సమానమే వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అనే సందేశంతో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి డిఎంసి రోడ్డులో ఉన్న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల చైర్మన్ డాక్టర్ వి.డేవిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమానత్వం, మానవ విలువలు, హక్కుల పరిరక్షణపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడూ మానవ హక్కుల కాపాడువాడిగా నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రాయలసీమ చైర్మన్ వీరబల్లి జయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
“దేశంలోని ప్రతి వ్యక్తి కష్టాల్లో ఉన్నా, పేదైనా, సామాన్యుడైన ఆయనకు జీవించడానికి అవసరమైన మౌలిక హక్కులు ప్రభుత్వం కల్పించాల్సిందే. ఆ హక్కుల కోసం పోరాడడం, వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం మనందరి బాధ్యత” అని అన్నారు.
అన్నమయ్య జిల్లా విజిలెన్స్ చైర్మన్ గోపినేని ప్రసాద్ మాట్లాడుతూ
“ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాటిని ఆపడానికి చట్టాలు ఉన్నా… అమలు పటిష్టంగా చేయాలి. మానవ హక్కుల ఉల్లంఘనను ఎవరూ సహించకూడదు” అని నొక్కి చెప్పారు.
నందలూరు రైల్వే కన్సల్టెంట్ మెంబర్ రాచూరి మురళి మాట్లాడుతూ
“ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, వాటిని వినియోగించుకునే దిశగా ముందడుగు వేయాలి. సమానత్వం, న్యాయం, గౌరవం ఇవి మన దేశానికి పునాది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో నాగరాజు, సాయి, వెంకటేష్, బన్నీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.