Thursday, 5 February 2026
  • Home  
  • జీవీఎంసీ పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .
- విశాఖపట్నం

జీవీఎంసీ పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

జీవీఎంసీ పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ . *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూలు పై ప్రత్యేక దృష్టి సారించి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో డి సి (ఆర్) ఎస్.శ్రీనివాసరావు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులతో పాటు పాత బకాయిలను, నీటి చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. కొన్ని జోనల్లో తక్కువగా పన్నుల వసూళ్లు చేస్తున్నారని వాటిపై దృష్టి సారించి పాత బకాయిలను కలుపుకొని పన్నులు వసూళ్ల చేయాలన్నారు. రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల యొక్క పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. ప్రతిరోజు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించి రోజుకో సచివాలయం పరిధిలోని ఇండ్లను సందర్శించి ఆస్తి, ఖాళీ జాగా పన్నులను వసూలు చేయాలన్నారు. నగరంలో అదనంగా సౌకర్యం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జోనల్ కమిషనర్లు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు సౌకర్యం కేంద్రాలను సందర్శించాలని సౌకర్యం కేంద్రాలు సరిగా పనిచేస్తేనే జీవీఎంసీ కి ఆదాయం వస్తుందని కమిషనర్ తెలిపారు. 98 వార్డులలో గల సహాయక ఇంజనీర్లు (వాటర్ సప్లై) ఎమినిటీ కార్యదర్శులను కలుపుకొని పనిచేయాలని రెవెన్యూ ఆఫీసర్లకు ఆదేశించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఆస్తి పన్నులు చెల్లించని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ యొక్క ఆస్తి పన్నుల చెల్లించేందుకు సిడిఎంఏ వెబ్సైట్ అందుబాటులో వున్నప్పటికీ, జీవీఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పన్నులు చెల్లించే విధంగా ఆస్తి పన్ను చెల్లింపు దారులకు అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. మొండి బకాయిలపై దృష్టి సారించి ఆస్తి పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునేలా జోనల్ కమిషనర్ స్థాయిలో జప్తు నోటీసులు తయారుచేసి బకాయిదారుల భవనాల వద్ద నోటీస్ బోర్డులు పెట్టాలన్నారు. అలాగే ఆస్తి పన్నులు విధించని భవనాలను గుర్తించి వాటికి పన్నులను విధించాలన్నారు. కొన్ని సచివాలయాలలో పరిధిలో జీరో టాక్స్ కలెక్షన్ అవుతుందని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ సమీక్షలో టెలికాన్ఫెరెన్స్ ద్వారా వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

జీవీఎంసీ పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి
– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .
*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూలు పై ప్రత్యేక దృష్టి సారించి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో డి సి (ఆర్) ఎస్.శ్రీనివాసరావు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులతో పాటు పాత బకాయిలను, నీటి చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. కొన్ని జోనల్లో తక్కువగా పన్నుల వసూళ్లు చేస్తున్నారని వాటిపై దృష్టి సారించి పాత బకాయిలను కలుపుకొని పన్నులు వసూళ్ల చేయాలన్నారు.
రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల యొక్క పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. ప్రతిరోజు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించి రోజుకో సచివాలయం పరిధిలోని ఇండ్లను సందర్శించి ఆస్తి, ఖాళీ జాగా పన్నులను వసూలు చేయాలన్నారు. నగరంలో అదనంగా సౌకర్యం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జోనల్ కమిషనర్లు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు సౌకర్యం కేంద్రాలను సందర్శించాలని సౌకర్యం కేంద్రాలు సరిగా పనిచేస్తేనే జీవీఎంసీ కి ఆదాయం వస్తుందని కమిషనర్ తెలిపారు. 98 వార్డులలో గల సహాయక ఇంజనీర్లు (వాటర్ సప్లై) ఎమినిటీ కార్యదర్శులను కలుపుకొని పనిచేయాలని రెవెన్యూ ఆఫీసర్లకు ఆదేశించారు.
ముఖ్యంగా దీర్ఘకాలంగా ఆస్తి పన్నులు చెల్లించని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ యొక్క ఆస్తి పన్నుల చెల్లించేందుకు సిడిఎంఏ వెబ్సైట్ అందుబాటులో వున్నప్పటికీ, జీవీఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పన్నులు చెల్లించే విధంగా ఆస్తి పన్ను చెల్లింపు దారులకు అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. మొండి బకాయిలపై దృష్టి సారించి ఆస్తి పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునేలా జోనల్ కమిషనర్ స్థాయిలో జప్తు నోటీసులు తయారుచేసి బకాయిదారుల భవనాల వద్ద నోటీస్ బోర్డులు పెట్టాలన్నారు. అలాగే ఆస్తి పన్నులు విధించని భవనాలను గుర్తించి వాటికి పన్నులను విధించాలన్నారు. కొన్ని సచివాలయాలలో పరిధిలో జీరో టాక్స్ కలెక్షన్ అవుతుందని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు.

ఈ సమీక్షలో టెలికాన్ఫెరెన్స్ ద్వారా వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.