*ఒయాసిస్ ఫర్టిలిటీ జనని బస్సు యాత్రను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు , భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాస్ గారు , జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు ,దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *
*కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రాధిక గారు, డాక్టర్ రాజు గారు, డాక్టర్ శ్రీదేవి గారు*
* కాళీమాత ఆలయం నుంచి వైఎంసిఎ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించిన ఒయాసిస్ సిబ్బంది
* జననీ బస్సు యాత్ర సంతానం లేని దంపతులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందన్న ఎమ్మెల్యే
*దేశంలో మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున ఒయాసిస్*
ఈరోజు బీచ్ రోడ్ వైఎంసిఎ వద్ద ఒయాసిస్ ఫర్టిలిటీ వారి ఆధ్వర్యంలో మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ ను మాజీ మంత్రివర్యులు, భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ,జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సంతానం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులకు వైద్య నిపుణులు ద్వారా పలు రకాల సౌకర్యాలు, టెస్టులు ద్వారా వైద్య సదుపాయం అందజేస్తామని అన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతుల కళ నెరవేరుటకు మెరుగైన అవకాశాలు ఒయాసిస్ కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు , వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు…


