బాల్య మిత్రుడు కొత్త పాలెం సీనియర్ నేత బిజ్జం ఎరుకల్ రెడ్డి మృతి పట్ల కావలి మాజీ యమ్ యల్ ఎ వంటేరు వేణుగోపాల్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తన కు బ్రాహ్మణ క్రాక హైస్కూల్ సహా విద్యార్ధి, ఆత్మీయ మిత్రుడు అయిన ఎరుకుల్ రెడ్డి హైదరాబాద్ లో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నిత్యం కావలి లో బేకరి సెంటర్, ఆర్.టి.సి సెంటర్ లో కాలక్షేపం చేస్తూ అన్ని వయసుల వారితో అనుబంధం సాగించిన ఎరుకుల్ మృతి పట్ల పలువురు విచారం వ్యక్తంచేశారు. వైసీపీ అభిమానిగా ఎరుకుల్ రెడ్డి కొనసాగుతూ ఇటీవల జలదంకి లో జరిగిన పార్టీ కార్యక్రమంలో కూడా హుషారుగా పాల్గొన్నారు.

బాల్య మిత్రుడు ఎరుకల్ రెడ్డి కివంటేరు నివాళి