Monday, 22 June 2026
  • Home  
  • మద్యానికి బానిసై రామారెడ్డి మండలంలో యువకుడు ఆత్మహత్య: భార్య వియోగం తట్టుకోలేకేనా?
- కామారెడ్డి

మద్యానికి బానిసై రామారెడ్డి మండలంలో యువకుడు ఆత్మహత్య: భార్య వియోగం తట్టుకోలేకేనా?

​రామారెడ్డి,22 జూన్, ( పున్నమి ప్రతినిధి ) : మద్యం మహమ్మారి ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. కంటికి రెప్పలా కాపాడు కోవా ల్సిన భార్య అనారోగ్యంతో దూరమవ్వడం, దానికి తోడు మద్యం మత్తులో మునిగిపోవడంతో ఒక యువకుడు దారుణమైన స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామారెడ్డి మండలం విస్సన్న గ్రామంలో చేతులు కోసుకుని, మెడకు తాడు బిగించుకుని ప్రాణాలు తీసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.గత కొంతకాలంగా హింసాత్మక ప్రవర్తన స్థానిక వివరాల ప్రకారం… విస్సన్న గ్రామానికి చెందిన సిద్ధం రమేష్ అనే యువకుడు గత కొంతకాలంగా మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఆగ్రహానికి లోనవుతూ, కళ్ళు సీసాలను పగలగొట్టి తన చేతులు, ఛాతి, ముఖంపై ఇష్టం వచ్చినట్లు కోసుకుంటూ పిచ్చిగా ప్రవర్తించేవాడు. కాగా, గత రెండు నెలల క్రితం అతని భార్య నవ్య అనారోగ్య కారణాలతో మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన రమేష్, అప్పటినుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై రాత్రింబవళ్లు కల్లు తాగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.”నేను చచ్చిపోతాను…” అంటూ తల్లితో మాటలు ఈ క్రమంలోనే నిన్న (ఆదివారం) రాత్రి దాదాపు 8 గంటల సమయంలో రమేష్ ఇంట్లో కల్లు తాగుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లితో మాట్లాడుతూ… “నేను చచ్చిపోతాను, అందరూ మంచిగా ఉండండి. అందరినీ అడిగినట్లు చెప్పు” అని అన్నాడు. అనంతరం చికెన్ తీసుకురావాలంటూ తల్లిని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపించే శాడు. కొడుకు ప్రవర్తనతో ఆందోళన చెందిన తల్లి, రాత్రి ఇంటి బయటే పడుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొడుకుకు నచ్చజెబుదామని లోపలికి వెళ్లగా, అతను వినకుండా ఆమెను మళ్లీ బయటకు గెంటేశాడు.ఉదయం చూసేసరికి మృత దేహమై..సోమవారం ఉదయం 9 గంటల సమ యంలో తల్లి నిద్రలేచి ఇంట్లోకి వెళ్లి చూడగా, అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమె గుండె పగిలి పోయింది. రమేష్ మద్యం మత్తులో తన కుడి, ఎడమ చేతులను బలంగా కోసుకున్నాడు. అంతే కాకుండా, తీవ్ర నిర్ణయం తీసుకుంటూ తన మెడ చుట్టూ మసాలా దారాన్ని గట్టిగా చుట్టుకుని, దాని పై నలుపు, ఎరుపు రంగు ప్లాస్టర్లు వేసుకున్నా డు. దీంతో ఊపిరాడక విస్సన్న గ్రామంలోని తన నివా సంలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఎవరి పై అనుమానాలు లేవు..కుమారుడి మృత దేహాన్ని చూసి తల్లడిల్లిపోయిన తల్లి, వెంటనే ఈ విషయా న్ని తన కులస్థులైన కొక్కొండ రాజేందర్, సిద్ధం నరేష్‌లకు సమాచారం అందించింది. తన కుమా రుడి మరణంపై తనకు ఎవరిపైనా ఎలాంటి అను మానాలు లేవని, మద్యం మత్తులోనే అతను ఈ దారుణానికి ఒడిగట్టాడని తల్లి కన్నీరు మున్నీరు గా విలపించింది. స్థానిక పోలీసులు ఈ ఘట నపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నా రు.

​రామారెడ్డి,22 జూన్, ( పున్నమి ప్రతినిధి ) :

మద్యం మహమ్మారి ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. కంటికి రెప్పలా కాపాడు కోవా ల్సిన భార్య అనారోగ్యంతో దూరమవ్వడం, దానికి తోడు మద్యం మత్తులో మునిగిపోవడంతో ఒక యువకుడు దారుణమైన స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామారెడ్డి మండలం విస్సన్న గ్రామంలో చేతులు కోసుకుని, మెడకు తాడు బిగించుకుని ప్రాణాలు తీసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.గత కొంతకాలంగా హింసాత్మక ప్రవర్తన స్థానిక వివరాల ప్రకారం… విస్సన్న గ్రామానికి చెందిన సిద్ధం రమేష్ అనే యువకుడు గత కొంతకాలంగా మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఆగ్రహానికి లోనవుతూ, కళ్ళు సీసాలను పగలగొట్టి తన చేతులు, ఛాతి, ముఖంపై ఇష్టం వచ్చినట్లు కోసుకుంటూ పిచ్చిగా ప్రవర్తించేవాడు. కాగా, గత రెండు నెలల క్రితం అతని భార్య నవ్య అనారోగ్య కారణాలతో మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన రమేష్, అప్పటినుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై రాత్రింబవళ్లు కల్లు తాగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.”నేను చచ్చిపోతాను…” అంటూ తల్లితో మాటలు ఈ క్రమంలోనే నిన్న (ఆదివారం) రాత్రి దాదాపు 8 గంటల సమయంలో రమేష్ ఇంట్లో కల్లు తాగుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లితో మాట్లాడుతూ… “నేను చచ్చిపోతాను, అందరూ మంచిగా ఉండండి. అందరినీ అడిగినట్లు చెప్పు” అని అన్నాడు. అనంతరం చికెన్ తీసుకురావాలంటూ తల్లిని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపించే శాడు. కొడుకు ప్రవర్తనతో ఆందోళన చెందిన తల్లి, రాత్రి ఇంటి బయటే పడుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొడుకుకు నచ్చజెబుదామని లోపలికి వెళ్లగా, అతను వినకుండా ఆమెను మళ్లీ బయటకు గెంటేశాడు.ఉదయం చూసేసరికి మృత దేహమై..సోమవారం ఉదయం 9 గంటల సమ యంలో తల్లి నిద్రలేచి ఇంట్లోకి వెళ్లి చూడగా, అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమె గుండె పగిలి పోయింది. రమేష్ మద్యం మత్తులో తన కుడి, ఎడమ చేతులను బలంగా కోసుకున్నాడు. అంతే కాకుండా, తీవ్ర నిర్ణయం తీసుకుంటూ తన మెడ చుట్టూ మసాలా దారాన్ని గట్టిగా చుట్టుకుని, దాని పై నలుపు, ఎరుపు రంగు ప్లాస్టర్లు వేసుకున్నా డు. దీంతో ఊపిరాడక విస్సన్న గ్రామంలోని తన నివా సంలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఎవరి పై అనుమానాలు లేవు..కుమారుడి మృత దేహాన్ని చూసి తల్లడిల్లిపోయిన తల్లి, వెంటనే ఈ విషయా న్ని తన కులస్థులైన కొక్కొండ రాజేందర్, సిద్ధం నరేష్‌లకు సమాచారం అందించింది. తన కుమా రుడి మరణంపై తనకు ఎవరిపైనా ఎలాంటి అను మానాలు లేవని, మద్యం మత్తులోనే అతను ఈ దారుణానికి ఒడిగట్టాడని తల్లి కన్నీరు మున్నీరు గా విలపించింది. స్థానిక పోలీసులు ఈ ఘట నపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నా రు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.