యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారతదేశ ఔన్నత్యం,అభివృద్ధి దిశ, ప్రపంచ శాంతి తత్వంపై రాజంపేట బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ఆభిమానపూర్వకంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే దశాబ్దాల్లో వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ముఖ్యంగా వసుధైవ కుటుంబకం అనే భారతీయ సంస్కృత మూలసూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ దేశాలు పరస్పరం శాంతి, సౌహార్దతతో ముందుకు సాగాలని ప్రధాని మోడీ విజన్ ఉందని తెలిపారు.ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగి వాణిజ్యపరంగా,మానవతా పరంగా,అభివృద్ధి తత్వాల పరంగా ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని వివరించారు.భారతదేశం భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రథమ స్థానాన్ని సాధించే శక్తి ఉన్నదని ధృవీకరించారు.అలాగే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నదని, బీజేపీ ప్రభుత్వంలో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాలు భారతదేశాన్ని వేగంగా పురోగమించే దిశగా నడిపిస్తున్నాయని వివరించారు.భారత్ ప్రపంచానికి ఇవ్వబోయే మార్గదర్శకత,శాంతి సందేశం, ఆర్థిక శక్తి,రాజకీయ స్థిరత్వం గురించి ఆయన చేసిన విశ్లేషణకు సభలో హాజరైనవారి ప్రశంసలు లభించాయి.

హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత ఔన్నత్య గానము – రాజంపేట పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్