నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులతో కలిసి ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్నదని,మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐక్యతతో ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : మంత్రులు
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులతో కలిసి ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్నదని,మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐక్యతతో ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

