విశాఖ పట్నం, నవంబర్ 19.
నగరంలోని వన్ టౌన్ బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ దేవస్థానం కార్యనిర్వహణాధి కారిణి కె.శోభారాణి తెలిపారు. బుధవారం దేవస్థానం ఆవరణలోని అన్న ప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మార్గశిర మాసోత్సవాలను నవంబర్ 21వ తేదీ శుక్రవారం నుంచి, డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం వరకు సాంప్రదాయ బద్ధంగా జరుపుతా మన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యా యన్నారు. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు వేద సభ అర్చక సదస్సును, డిసెంబర్ 13వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రథ యాత్ర, డిసెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్నదానం అదే రోజు సాయంత్రం 4 గంటలకు సహస్ర ఘటాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు ఘనంగా జరుపుతా మన్నారు. ఈ కార్యక్రమాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశా మన్నారు. చలువ పందిళ్ళు వేయడంతో పాటుగా, భక్తులకు మంచి నీటి సదుపాయం కూడా కల్పిస్తున్నా మన్నారు. భక్తులు దేవస్థానం సిబ్బంది, వాలంటీర్లకు సహకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ జిల్లా సమాచార శాఖాధికారి సదారావు, జిల్లా సహాయ సమాచార అధికారి నారాయణ రావు, దేవస్థానం సహాయ కార్యనిర్వహణా ధికారి రాజేంద్ర కుమార్, దేవస్థానం పురోహితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహణ!.. ఈఓ శోభారాణి.
విశాఖ పట్నం, నవంబర్ 19. నగరంలోని వన్ టౌన్ బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ దేవస్థానం కార్యనిర్వహణాధి కారిణి కె.శోభారాణి తెలిపారు. బుధవారం దేవస్థానం ఆవరణలోని అన్న ప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మార్గశిర మాసోత్సవాలను నవంబర్ 21వ తేదీ శుక్రవారం నుంచి, డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం వరకు సాంప్రదాయ బద్ధంగా జరుపుతా మన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యా యన్నారు. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు వేద సభ అర్చక సదస్సును, డిసెంబర్ 13వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రథ యాత్ర, డిసెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్నదానం అదే రోజు సాయంత్రం 4 గంటలకు సహస్ర ఘటాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు ఘనంగా జరుపుతా మన్నారు. ఈ కార్యక్రమాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశా మన్నారు. చలువ పందిళ్ళు వేయడంతో పాటుగా, భక్తులకు మంచి నీటి సదుపాయం కూడా కల్పిస్తున్నా మన్నారు. భక్తులు దేవస్థానం సిబ్బంది, వాలంటీర్లకు సహకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ జిల్లా సమాచార శాఖాధికారి సదారావు, జిల్లా సహాయ సమాచార అధికారి నారాయణ రావు, దేవస్థానం సహాయ కార్యనిర్వహణా ధికారి రాజేంద్ర కుమార్, దేవస్థానం పురోహితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

