నెల్లూరు, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి):
జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా కొనసాగుతోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో పట్టణం, శివారు ప్రాంతాల్లో పోలీసు బలగాలు డ్రోన్లతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయి. ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గంజాయి వినియోగం, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపడుతున్నారు. నేరప్రవణ ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా పెంచిన పోలీసులు ప్రజలను చట్టం పాటించాలని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం కోసం డయల్ 112 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1972ను సంప్రదించవచ్చని తెలిపారు.


