సీతారామపురం నవంబర్ (పున్నమి ప్రతినిది)
స్కిల్ టెక్నాలజీకి సంబంధించి దుత్తలూరు లోని ఆదర్శ పాఠశాల విద్యార్థుల విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. దుత్తలూరు ఆదర్శ పాఠశాల ఐటి విద్యార్థులు అబ్దుల్ అజీజ్ నజీర్ , ఉస్మాన్ గని లు ఒకేషనల్ ట్రైనర్ నరేష్ సూచనలు సలహాల తో జిల్లాస్థాయిలో స్కిల్ కాంపిటీషన్ కు అర్హత సాధించి శుక్రవారం నెల్లూరులోని సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్కిల్ కాంపిటీషన్ కార్యక్రమంలో దుత్తలూరు లోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని ప్రిన్సిపాల్ సైమన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పాల్గొంటే విద్యార్థుల యొక్క నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెంపొందించుకోవచ్చన్నారు.


