విశాఖ పట్నం పోర్ట్ స్టేడియంలో బుధవారం బోరా వెంకట ప్రసాద్ యాదవ్ జ్ఞాపకార్థం డాన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు నిర్వహించిన, డాన్ ప్రసాద్ ప్రీమియం క్రికెట్ లీగ్ (డి పి పి ఎల్) పోటీలు రసవత్తరంగా సాగాయి..ఈ క్రికెట్ లీగ్ పోటీలకు ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జి విచ్చేశారు. ఈ క్రికెట్ పోటీలకు వివిధ ప్రాంతాల నుండి ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు వారి వారి టీం లతో హాజరై క్రికెట్ పోటీలో తలపడ్డారు.ఆద్యంతం ఎంతో రసవత్తరంగా సాగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా మహేష్ లెజెండ్స్ రన్నరప్ గా కే వి ఆర్ టైటాన్ లు నిలిచారు..ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన టీమ్ కు ట్రోఫీ తో పాటు 1,00,000/- నగదు..రన్నరప్ గా నిలిచిన టీంకు 60,000/- నగదు ను ఉత్తమ బ్యాట్స్ మెన్ పి సాయి కు 3000/- ఉత్తమ బౌలర్ బి మనోహర్ కు 3000/- మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఓ వినయ్ కుమార్ 4000/- కు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గండి బాబ్జీ చేతులు మీదుగా అందించారు.
ఈ క్రికెట్ టోర్నమెంట్ కు 54వ వార్డు అధ్యక్షులు కార్తీక్ కుట్ట, 48వ వార్డు అధ్యక్షులు గొర్లి అప్పారావు, 49వ వార్డు అధ్యక్షులు సంగు వాసు, కోన శ్రీను, కిషోర్ కవి, ఒడిస్సాల లక్ష్మణ్, జే.జే కుమార్, నాగు, డాన్ మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


