పొదలకూరు జులై 25 పున్నమి ( ప్రతినిధి )
రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. సీఐ గుత్తి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీ, రౌడీషీటర్లపై నిఘా పెంచాలని ఆదేశించారు. గ్రామాల వారీగా పోలీసు సిబ్బందిని కేటాయించి శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారు. సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ శివ రాకేష్ తెలిపారు. శాంతియుత ఎన్నికల నిర్వహణే,లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.


