ఆంధ్ర వైద్య కళాశాల రేడియాలజీ విద్యార్ధులకు బంగారు పతకాలు
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
గీతం విశ్వవిద్యాలయం లో నిర్వహించిన రేడియాలజీ రాష్ట్ర స్థాయి సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. ఈ సదస్సు లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు నిర్వహించిన పరిశోధన పత్రాలు మరియు పరిశోధన పత్రికలు ప్రదర్శనలో ఆంధ్ర వైద్య కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు అద్భుతం గా రాణించారు. రాష్ట్ర స్థాయిలో 180 పరిశోధన పత్రికలు ప్రదర్శనకు అనుమతి లభించగా డా. జి. పుష్పిత, ప్రధమ స్థానం లో నిలిచి ప్రతిష్టాత్మకమైన వైజాగ్ సిటీ సబ్ చాప్టర్ అవార్డు బంగారు పతకం అందుకున్నారు. అలాగే 150 పరిశోధన పత్రాలు ప్రదర్శించగా డా. జయగురు సంబతరాజన్ ద్వితీయ బహుమతిగా డా. రాజారెడ్డి బంగారు పథకం మరియు డా. మేఘన అడిగ ప్రత్యేక ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అవార్డు లు అందుకున్న విద్యార్ధినీవిద్యార్ధులకు కళాశాల ప్రిన్సిపాల్ డా. సంద్యాదేవి, కింగ్ జార్జ్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డా. వాణి, రేడియాలజీ విభాగాధిపతి డా. బుజ్జి బాబు, రేడియాలజీ ఆచార్యులు డా.ఉమా మహేశ్వర రావు, ఫాకల్టీ మరియు తోటి విద్యార్ధులు అభినందనలు తెలిపారు.


