పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
భారతీయ జనతా పార్టీ ఖమ్మం టూ టౌన్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా శ్రీ జ్యోతుల యుగంధర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని తెలిపారు.
ఖమ్మం టూ టౌన్ ప్రజా సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టి, పార్టీని సంస్థాగతంగా బలపరచి అన్ని వర్గాలలో విస్తరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఖమ్మం అధ్యక్షులు ధనియకుల వెంకటనారాయణ గారికి, జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారికి, సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్, ఒక్కలంక సుబ్రహ్మణ్యం, మేకల నాగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ గారికి, ఖమ్మం టూ టౌన్ నాయకులకు, మరియు ఖమ్మం జిల్లా బిజెపి నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


