Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అధికారులు, సర్పంచ్ చొరవ
- అన్నమయ్య

ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అధికారులు, సర్పంచ్ చొరవ

చిట్వేల్, అక్టోబర్ 31పున్నమి ప్రతినిధి ఇటీవలి వర్షాల అనంతరం మలినాలు, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు శుక్రవారం పోల్లోపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో బ్లీచింగ్ పొడి మరియు సున్నం మిశ్రమాన్ని పిచికారి చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని చిట్వేల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే. శ్రీనివాసులు, సీనియర్ పంచాయతీ కార్యదర్శి పి. రమణయ్య, పోల్లోపల్లి పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగరాజు వెంకటసుబ్బమ్మ పాల్గొని పంచాయతీ సిబ్బందిని ప్రోత్సహించారు.సర్పంచ్ మాట్లాడుతూ, వర్షాల తర్వాత వ్యాధుల వ్యాప్తి ప్రమాదం పెరిగే అవకాశం ఉండడంతో ప్రతి వీధి, కాలనీలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.అదేవిధంగా, సి. కందులవారిపల్లిలో కూడా శుక్రవారం బ్లీచింగ్ పొడి, సున్నం చల్లడం ద్వారా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ఆరోగ్య రక్షణలో భాగంగా ఈ చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. స్థానికులు పంచాయతీ చొరవను ప్రశంసిస్తూ, వర్షాల అనంతరం చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

చిట్వేల్, అక్టోబర్ 31పున్నమి ప్రతినిధి
ఇటీవలి వర్షాల అనంతరం మలినాలు, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు శుక్రవారం పోల్లోపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో బ్లీచింగ్ పొడి మరియు సున్నం మిశ్రమాన్ని పిచికారి చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని చిట్వేల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే. శ్రీనివాసులు, సీనియర్ పంచాయతీ కార్యదర్శి పి. రమణయ్య, పోల్లోపల్లి పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగరాజు వెంకటసుబ్బమ్మ పాల్గొని పంచాయతీ సిబ్బందిని ప్రోత్సహించారు.సర్పంచ్ మాట్లాడుతూ, వర్షాల తర్వాత వ్యాధుల వ్యాప్తి ప్రమాదం పెరిగే అవకాశం ఉండడంతో ప్రతి వీధి, కాలనీలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.అదేవిధంగా, సి. కందులవారిపల్లిలో కూడా శుక్రవారం బ్లీచింగ్ పొడి, సున్నం చల్లడం ద్వారా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ఆరోగ్య రక్షణలో భాగంగా ఈ చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
స్థానికులు పంచాయతీ చొరవను ప్రశంసిస్తూ, వర్షాల అనంతరం చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.