Thursday, 12 February 2026
  • Home  
  • మొంథా తీవ్ర ప్రభావంతో ! పంటలు, రహదారులు, శాఖలకు భారీ నష్టం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తీవ్ర ప్రభావంతో ! పంటలు, రహదారులు, శాఖలకు భారీ నష్టం

మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విపరీత నష్టం సంభవించింది. మొత్తం 1,696 గ్రామాల్లోని 1.4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా 90 వేల ఎకరాల్లో వరి, 23 వేల ఎకరాల్లో పత్తి, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నాశనమయ్యాయి. సుమారు 75 వేల మంది రైతులు ఈ విపత్తుతో నష్టపోయినట్లు సమాచారం. అదే విధంగా 95 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యాన పంటలు తీవ్ర నష్టం చవిచూశాయి. పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు బీభత్సానికి గురై అనేక చోట్ల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. సుమారు 1,800 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసమైనట్లు అంచనా. ఆర్ అండ్ బీ శాఖకు మాత్రమే రూ.1,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్, నీటిపారుదల, హౌసింగ్ శాఖలకు కూడా భారీ నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో తెలిపారు.

మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విపరీత నష్టం సంభవించింది. మొత్తం 1,696 గ్రామాల్లోని 1.4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా 90 వేల ఎకరాల్లో వరి, 23 వేల ఎకరాల్లో పత్తి, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నాశనమయ్యాయి. సుమారు 75 వేల మంది రైతులు ఈ విపత్తుతో నష్టపోయినట్లు సమాచారం.

అదే విధంగా 95 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యాన పంటలు తీవ్ర నష్టం చవిచూశాయి. పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు బీభత్సానికి గురై అనేక చోట్ల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. సుమారు 1,800 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసమైనట్లు అంచనా. ఆర్ అండ్ బీ శాఖకు మాత్రమే రూ.1,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్, నీటిపారుదల, హౌసింగ్ శాఖలకు కూడా భారీ నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.