ఏపీపై మొంథా పంజా.
అర్ధరాత్రి నరసాపురం సమీపంలో తీరం దాటిన మొంథా తుఫాన్.. మొంథా తుఫాన్ తీరం దాటిన సమయంలో భారీగా ఈదురుగాలులు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై ఎక్కువగా తుఫాన్ ఎఫెక్ట్.. నేలకూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.
బంగాళాఖాతం ఎప్పటికీ అంచనాలకు అందని సముద్రం. ఎప్పుడు ఎలా మారుతుందో ముందుగా చెప్పడం అసాధ్యం. ఒక రోజూ ప్రశాంతంగా ఉండే ఈ సముద్రం, మరుసటి రోజు బలమైన తుపాన్లతో అల్లకల్లోలంగా మారిపోతుంది. ఈసారి కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన “మొంథా” తుపాన్ అధికారులు ఊహించిన దిశలో కదలకుండా తనదైన మార్గంలో సాగుతోంది. నాలుగు రోజులుగా వాతావరణశాఖ, విపత్తు నిర్వహణ అధికారులు ఈ తుపాను కాకినాడ తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తూ వచ్చారు. సీఎం సమీక్షా సమావేశంలో కూడా అదే సమాచారం అందించబడింది. అయితే ఆ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.
ఇప్పుడీ “మొంథా” తుపాను అంచనాలను మించిపోయే విధంగా తన మార్గాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమదిశగా దూసుకెళ్తోంది. దీని కేంద్ర భాగంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు నమోదవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇది పాలకొల్లు నుండి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉండి, షాకింగ్ విషయమేమిటంటే, ఈ తుపాను ఇప్పుడు అర్ధరాత్రి నరసాపూర్ సమీపంలో తీరం దాటిన తుఫాన్.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు, అంతర్వేది, కేసుదాస్ పాలేం, ఓడలరేవు, కరవాక, వంటి ప్రాంతాలను మొంథా తుఫాన్ మార్గాలను సృష్టించుకునీ చివరకు నరసాపురం సమీపంలో తీరం దాటిన మొంథా తుఫాన్.
మొంథా తీవ్రతుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రానున్న 6గంటల్లో తుపానుగా బలహీనపడనుందని వెల్లడించింది.
తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.


