Thursday, 5 February 2026
  • Home  
  • ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ 4 వ రోజు డివిజన్ ల పర్యటన -బూత్ స్థాయి లో ప్రజా సమస్య లపై సమీక్ష, పార్టీ బలోపేతమే లక్ష్యం
- ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ 4 వ రోజు డివిజన్ ల పర్యటన -బూత్ స్థాయి లో ప్రజా సమస్య లపై సమీక్ష, పార్టీ బలోపేతమే లక్ష్యం

పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరంలో బీజేపీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి సూచనల ప్రకారం ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ గారు 4వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు 49వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా 49వ డివిజన్ సీనియర్ నాయకులు ఈశ్వర పనుల రామారావు ఆధ్వర్యంలో, శక్తి కేంద్ర ఇన్‌చార్జి మరియు టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఈశ్వర్ ప్రగడ లలిత సమక్షంలో 126, 127, 128 పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. బూత్ పరిధిలో ఉన్న స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. వెంకటనారాయణ గారు మాట్లాడుతూ, బూత్ స్థాయి బలమైనప్పుడు పార్టీ మరింత శక్తివంతమవుతుందని, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పార్టీ పైనికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తోందని, ప్రజల మద్దతుతో ఖమ్మం నగరంలో పార్టీ ఆధిపత్యం పెంపొందించాలనే సంకల్పంతో పర్యటన కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ప్రధాన కార్యదర్శులు రుద్రగాని మాధవ్, కన్నే కంటి కృష్ణచారి, పాశం శ్రీనివాసరెడ్డి, భూక్య వెంకట్, ఇనుగుర్తి ఉపేంద్ర, దాసరి వీరభద్రం, సీనియర్ నేతలు దాసరి మధు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు

పున్నమి ప్రతి నిధి

ఖమ్మం నగరంలో బీజేపీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి సూచనల ప్రకారం ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ గారు 4వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు 49వ డివిజన్‌లో పర్యటించారు.

ఈ సందర్భంగా 49వ డివిజన్ సీనియర్ నాయకులు ఈశ్వర పనుల రామారావు ఆధ్వర్యంలో, శక్తి కేంద్ర ఇన్‌చార్జి మరియు టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఈశ్వర్ ప్రగడ లలిత సమక్షంలో 126, 127, 128 పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. బూత్ పరిధిలో ఉన్న స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.

వెంకటనారాయణ గారు మాట్లాడుతూ, బూత్ స్థాయి బలమైనప్పుడు పార్టీ మరింత శక్తివంతమవుతుందని, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పార్టీ పైనికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తోందని, ప్రజల మద్దతుతో ఖమ్మం నగరంలో పార్టీ ఆధిపత్యం పెంపొందించాలనే సంకల్పంతో పర్యటన కొనసాగిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో టూ టౌన్ ప్రధాన కార్యదర్శులు రుద్రగాని మాధవ్, కన్నే కంటి కృష్ణచారి, పాశం శ్రీనివాసరెడ్డి, భూక్య వెంకట్, ఇనుగుర్తి ఉపేంద్ర, దాసరి వీరభద్రం, సీనియర్ నేతలు దాసరి మధు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.