*విశాఖపట్నం అక్టోబర్ పున్నమిప్రతినిధి*
*స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక ,మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే ప్రధాన లక్ష్యం*
స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్యం ,సామాజిక, ఆర్థిక శ్రేయస్సు కోసం మొప్మా ఆధ్వర్యంలో రూపొందించిన సఖి సురక్ష కార్యక్రమాన్ని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు డోక్రా బజార్ వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక ,మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖి సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని తెలిపారు. మహిళలకు పలు రకాల పరీక్షలు తో పాటు వారికి లభించే ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వివరించారు . కార్యక్రమంలో పలు వార్డు నుంచి వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు…


